*రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గురువారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు*
ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ
👉కేసీఆర్ అంటేనే నీళ్లు గుర్తుకు వస్తాయి
👉ఏడు,ఎనిమిది నెలల్లోనే సీతారామ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదు
👉అధికారంలో ఉండి స్విచ్ అన్ చేయండి, గత పాలకులను మాత్రం అవమానపరచవద్దు
👉కాంగ్రెస్ ఎన్ని చేసినా రైతులు, ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను వారి నుంచి తీసివేయలేరు
👉 తెలంగాణ రాష్ట్రం కోసం తాము కొట్లాడినది నీళ్లు,నియమాకాలతో పాటు అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం
👉 రాష్ట్ర ఏర్పాటు జరిగాక ప్రతి అంశంలో మొదటి హక్కు తెలంగాణ బిడ్డలదే అన్నట్టుగా 10ఏండ్ల కేసీఆర్ సుపరిపాలన సాగింది
👉ప్రభుత్వోద్యోగాల నుంచి రాజకీయ పదవుల వరకు ప్రతి అంశంలో తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవానికి పెద్ద పీట వేశాం
👉 కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాము ముందు నుంచి చెబుతున్నట్టే తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతున్నది
👉 తెలంగాణతో ఏ మాత్రం సంబంధం లేని అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నిలబెడుతున్నది
👉ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించడమే
👉 కాంగ్రెస్ అవలంభిస్తున్న తప్పుడు విధానాలను తెలంగాణ బిడ్డలందరూ గమనిస్తున్నరు
👉 తెలంగాణ రాష్ట్ర సాధన, ప్రయోజనాల కోసం పుట్టినటువంటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టయితే ఇలా జరిగేదా?జరిగేది కాదని ప్రజలు అంటున్నరు
👉ఇతర రాష్ట్రాల నాయకుల నుంచి ఎన్ని విజ్ఞప్తులు,వత్తిళ్లు వచ్చినా కూడా కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలనే పెద్దల సభ రాజ్యసభకు పంపడం జరిగింది
👉బీసీ బిడ్డలైన కే.కేశవరావు,డీ.శ్రీనివాస్, బడుగుల లింగయ్య యాదవ్,బండా ప్రకాష్ ముదిరాజ్ లను రాజ్యసభ సభ్యులను చేశారు
👉ఆ తర్వాత బండా ప్రకాష్ శాసనమండలికి పంపాల్సి రావడంతో ఆ స్థానంలో తనను రాజ్యసభకు పంపారు,ఆ తర్వాత రెన్యూవల్ చేయడం తెలిసిందే
👉 కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నుంచి అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నా కూడా వేరే రాష్ట్రం వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం తీవ్ర విచారకరం
👉 సీనియర్ నాయకుడు, బీసీ ప్రముఖుడు వీ.హనుమంతరావుకు ఇస్తే బాగుండేది
👉కేకే రాజీనామా చేయడంతో ఆ పదవి హనుమంతరావుకే వస్తుందని అంతా అనుకున్నరు
👉మన తెలంగాణలో ఆ పార్టీ నుంచి ముస్లిం నాయకులు ఒక్కరు కూడా చట్టసభల్లో లేరు
👉 ముస్లిం లేదా మాదిగల నుంచైనా ఎంపిక చేయకుండా, తెలంగాణ అంటే గిట్టని వేరే రాష్ట్రం నాయకుడికి ఇవ్వడం సమంజసంగా లేదు
👉అభిషేక్ సింఘ్వీ తెలంగాణ వ్యతిరేకి, పలుమార్లు వ్యతిరేకంగా మాట్లాడిండు
👉రాష్ట్రపతి పాలన పెట్టి తెలంగాణ ఏర్పాటు చేయాలన్నడు, తెలంగాణ వారికి పరిపాలన చేత కాదన్నట్లు మాట్లాడిండు
👉 తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల డిమాండ్స్ ఉన్నందున రెండో ఏస్ఆర్సీ వేయాలన్నడు
👉 హైదరాబాద్ నగరం లేని తెలంగాణ ఇవ్వాలన్నడు
👉 మంత్రివర్గంలో మున్నూరుకాపు, లంబాడి, ముస్లిం,ముదిరాజ్,యాదవ కులాలకు చోటు కల్పించలేదు
👉ఆ పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలంటే పట్టింపు లేదు
*మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్*-
👉ఉమ్మడి రాష్ట్రంలో పదవులు అన్నీ తెలంగాణేతరులకే
👉తెలంగాణ తెచ్చినందుకే రేవంత్ రెడ్డి సీఎం, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు
👉కేసీఆర్ పై చాలా పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీటు ఇవ్వలేదు
👉తెలంగాణ వ్యతిరేకులకు ఇక్కడ నుంచి పదవులు ఇవ్వడం బాధ కలిగిస్తోంది
👉తెలంగాణ వారికి ఇవ్వండి... కానీ ఇతరులకు వేయవద్దు
👉తెలంగాణ వారికి లేదా తెలంగాణకు అనుకూలంగా ఉన్న వారికి అవకాశం. ఇవ్వండి
👉బీసీలకు అవకాశం ఇస్తే చాలా బాగుండేది
0 Comments